Why Do Objects Change in Dreams?
Many of us have experienced something curious in dreams. We see one object, and within moments it changes into something else. Sometimes a person suddenly becomes another person, or a familiar place transforms into an entirely different location.
This is not merely random mental confusion. Ancient Indian sages deeply observed the dream state and used it as an important doorway to understand the nature of the mind itself.
Who Creates the Dream World?
In the waking state, our senses (eyes, touch, smell) confirm an object’s stability. In dreams, there is no physical object. In the dream state:
- The mind is the Creator
- The mind is the Observer
- The mind is the Experiencer
Therefore, there is no external stability, only the internal flow of the mind.
Dreams Are a Flow of Impressions
Within the mind exist countless impressions (Samskāras) and tendencies (Vāsanās). When external senses quiet down during sleep, these inner impressions move freely. One thought jumps into another, and accordingly, forms change instantly.
Emotion Over Form
In dreams, the emotional flow is more important than the object itself. For instance, “sweets” might represent pleasure, while “soap” represents a sense of caution or disturbance. As the emotional current shifts, the dream imagery reshapes itself to match that feeling.
The Philosophical Inquiry
Texts like the Mandukya Upanishad ask a profound question: “Just as the dream world appears real until awakening, could our waking world also appear different from a higher state of consciousness?”
Conclusion: Dreams reveal the extraordinary creative power of the mind. Understanding the mind is considered the highest form of knowledge in Indian tradition.
స్వప్నంలో వస్తువులు ఎందుకు మారిపోతుంటాయి?
— మనస్సు, సంస్కారాలు, మరియు స్వప్నావస్థ యొక్క రహస్యంమనలో చాలా మందికి ఒక అనుభవం ఉంటుంది. కలలో ఒక వస్తువు చూస్తుంటాం. కొన్ని క్షణాల తరువాత అదే వస్తువు ఇంకో రూపంగా మారిపోతుంది. కొన్ని సార్లు ఒక వ్యక్తి మరో వ్యక్తిగా మారిపోతాడు. ఒక ప్రదేశం ఒక్కసారిగా పూర్తిగా వేరే ప్రదేశంలా కనిపిస్తుంది.
ఈ మార్పులు ఎందుకు జరుగుతాయి? ఇది కేవలం యాదృచ్ఛికమైన మానసిక గందరగోళం కాదు. భారతీయ ఋషులు స్వప్నావస్థను ఎంతో లోతుగా పరిశీలించి, మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి దీనిని ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగించారు.
ఒక చిన్న స్వప్న అనుభవం
ఒక వ్యక్తికి కలలో ఒక చోట ఎన్నో రకాల స్వీట్లు కనిపించాయి. తనకు స్వీట్లు అంటే ఇష్టం కావడంతో వాటిని ఒక బ్యాగ్‌లో వేసుకుంటున్నాడు. అయితే కొన్ని క్షణాలకే ఆ స్వీట్లు డిటర్జెంట్ సోప్స్‌లా మారిపోయాయి. “అయ్యో! ఇవి సోప్స్ అయితే స్వీట్లతో కలిస్తే వాసన వస్తుంది” అని ఆలోచిస్తుండగానే మెలకువ వచ్చింది.
మొదట “స్వీట్” గా కనిపించినది, కొన్ని క్షణాల తరువాత “సోప్” గా ఎందుకు మారింది?
స్వప్నంలో ప్రపంచాన్ని సృష్టించేది ఎవరు?
జాగ్రత్తావస్థలో మన ముందున్న వస్తువును కళ్ళు, చేతులు, ముక్కు, నాలుక అన్నీ కలిసి “ఇది ఫలానా వస్తువు” అని బుద్ధికి స్థిరమైన సమాచారం ఇస్తాయి. కానీ స్వప్నంలో బాహ్య వస్తువు ఉండదు. అక్కడ:
- మనస్సే సృష్టికర్త
- మనస్సే దర్శకుడు
- మనస్సే అనుభవించే వ్యక్తి
అందువల్ల అక్కడ బాహ్య వస్తువుల నుంచి వచ్చే “స్థిరత్వం” ఉండదు.
సంస్కారాల ప్రవాహమే స్వప్నం
నిద్రలో బాహ్య ఇంద్రియాలు నిశ్శబ్దం అయినప్పుడు, మనస్సులోని సంస్కారాలు (impressions) చలనం చెందుతాయి. ఒక భావం ఇంకో భావానికి వేగంగా దూకుతుంది. ఆ భావాలకు అనుగుణంగా వస్తువుల రూపాలు, వ్యక్తులు వెంటనే మారిపోతుంటారు.
“రూపం” కంటే “భావం” ముఖ్యమైనది
స్వప్నంలో వస్తువు కంటే ఆ వస్తువు వెనుక ఉన్న “భావం” ముఖ్యం. పైన చెప్పిన ఉదాహరణలో:
- స్వీట్: ఇష్టం, ఆనందం అనే భావనకు సూచిక.
- సోప్: కలుషితం, జాగ్రత్త అనే భావనకు సూచిక.
మనస్సులోని భావం మారగానే, దానికి తగినట్లుగా కలలోని వస్తువు రూపం కూడా మారిపోతుంది.
భారతీయ దర్శనాల లోతైన పరిశీలన
మాండూక్య ఉపనిషత్తు మరియు యోగవాశిష్ఠం వంటి గ్రంథాలు ఒక గొప్ప ప్రశ్న అడిగారు: “స్వప్న ప్రపంచం మెలకువ రాగానే అసత్యం అని తెలిసినట్లే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచాన్ని కూడా ఉన్నత చైతన్య స్థితి నుండి చూస్తే ఎలా కనిపిస్తుంది?”
ముగింపు: ప్రపంచాన్ని అనుభవించేది, రూపాలకు అర్థం ఇచ్చేది మనస్సే. అందుకే మనస్సును తెలుసుకోవడమే నిజమైన విద్య అని మన ఋషులు చెప్పారు.
ಕನಸಿನಲ್ಲಿ ವಸ್ತುಗಳು ಏಕೆ ಬದಲಾಗುತ್ತವೆ?
— ಮನಸ್ಸು, ಸಂಸ್ಕಾರಗಳು ಮತ್ತು ಸ್ವಪ್ನಾವಸ್ಥೆಯ ರಹಸ್ಯಕನಸಿನಲ್ಲಿ ಒಂದು ವಸ್ತು ಕೆಲವೇ ಕ್ಷಣಗಳಲ್ಲಿ ಇನ್ನೊಂದಾಗಿ ಬದಲಾಗುವುದನ್ನು ನಾವು ಗಮನಿಸಿರುತ್ತೇವೆ. ಇದು ಕೇವಲ ಅಸಂಬದ್ಧ ಕಲ್ಪನೆಯಲ್ಲ. ಭಾರತೀಯ ಋಷಿಗಳು ಮನಸ್ಸಿನ ಸ್ವಭಾವವನ್ನು ತಿಳಿಯಲು ಸ್ವಪ್ನಾವಸ್ಥೆಯನ್ನು ಒಂದು ಸಾಧನವಾಗಿ ಬಳಸಿದರು.
ಕನಸಿನ ಲೋಕದ ಸೃಷ್ಟಿಕರ್ತ ಯಾರು?
ಜಾಗೃತಾವಸ್ಥೆಯಲ್ಲಿ ಇಂದ್ರಿಯಗಳು ವಸ್ತುಗಳ ಸ್ಥಿರತೆಯನ್ನು ದೃಢಪಡಿಸುತ್ತವೆ. ಆದರೆ ಕನಸಿನಲ್ಲಿ ಯಾವುದೇ ಭೌತಿಕ ವಸ್ತುಗಳಿರುವುದಿಲ್ಲ. ಅಲ್ಲಿ:
- ಮನಸ್ಸೇ ಸೃಷ್ಟಿಕರ್ತ
- ಮನಸ್ಸೇ ಸಾಕ್ಷಿ (ನೋಡುವವನು)
- ಮನಸ್ಸೇ ಅನುಭವಿಸುವವನು
ಸಂಸ್ಕಾರಗಳ ಪ್ರವಾಹ
ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅಡಗಿರುವ ಸಂಸ್ಕಾರಗಳು (impressions) ನಿದ್ರೆಯ ಸಮಯದಲ್ಲಿ ಚಲನೆಗೆ ಬರುತ್ತವೆ. ಒಂದು ಭಾವನೆಯಿಂದ ಇನ್ನೊಂದಕ್ಕೆ ಮನಸ್ಸು ಜಿಗಿದಾಗ, ಕನಸಿನ ದೃಶ್ಯಗಳು ಮತ್ತು ರೂಪಗಳು ತಕ್ಷಣವೇ ಬದಲಾಗುತ್ತವೆ.
ರೂಪಕ್ಕಿಂತ ಭಾವ ಮುಖ್ಯ
ಕನಸಿನಲ್ಲಿ ವಸ್ತುಗಳಿಗಿಂತ ಅವುಗಳ ಹಿಂದೆ ಇರುವ ಭಾವಪ್ರವಾಹ ಮುಖ್ಯ. ಭಾವನೆಗಳು ಬದಲಾದಂತೆ ಕನಸಿನ ರೂಪಗಳೂ ಬದಲಾಗುತ್ತವೆ. ಉದಾಹರಣೆಗೆ, ಸಿಹಿಯು ಸಂತೋಷದ ಸಂಕೇತವಾದರೆ, ಸಾಬೂನು ಎಚ್ಚರಿಕೆ ಅಥವಾ ಅಶುದ್ಧತೆಯ ಭಾವವನ್ನು ಸೂಚಿಸಬಹುದು.
ತೀರ್ಮಾನ: ಲೋಕವನ್ನು ಅನುಭವಿಸುವುದು ಮತ್ತು ಅದಕ್ಕೆ ಅರ್ಥ ಕೊಡುವುದು ನಮ್ಮ ಮನಸ್ಸೇ. ಆದ್ದರಿಂದ ಮನಸ್ಸನ್ನು ತಿಳಿಯುವುದೇ ಅತ್ಯುನ್ನತ ವಿದ್ಯೆ ಎಂದು ಭಾರತೀಯ ದರ್ಶನಗಳು ಹೇಳುತ್ತವೆ.
