అక్షతృతీయ

అక్షతృతీయ నాడు బంగారం కొనడానికి ఎలాంటి శాస్త్ర ఆధారాలు లేవు. అక్షయ తృతీయనాడు చేసేదానాలు అక్షయ ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతుంటాయి. వేసవి తాపాన్ని చల్లార్చడానికి ఉధకుంబదానం (మంచి పాత్రలో మంచినీటిని) అక్షయతృతీయనాడు చేయాలని శాస్త్రం సూచించింది. అక్షయతృతీయనాడు చేసే పూజలు, జపాలు అక్షయఫలితాన్నిస్తాయి. ఇది కలియుగం కాబట్టి బంగారంలో కలియొక్క ప్రభావం అధికంగా వుంటుందని భాగవతంలోని పరీక్షిత రాజు యొక్క కత ద్వారా మనము తెలుసుకోవచ్చు. అక్షయతృతీయనాడు కలికి ఆశ్రయమైన బంగారం కొంటే కలియెక్క ప్రభావం అక్షయ మవుతుంది. అక్షయతృతీయ నాడు బంగారం కొనడం, జ్యోతిషశాస్త్ర ఆధారంగా రంగురాళ్ళు ధరించమని ఏ శాస్త్రం చెప్పలేదు. ఇది కేవలం వ్యాపార దృష్ఠితో చేయబడిన మంత్రం. సమాజశ్రేయస్సుకోసం నిర్దేశించినవి కావని శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు.

యం శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారకాత్
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతిం ||

     శాస్త్రము చెప్పినదానిని వదిలిపెట్టి, తమ నచ్చినట్టుగా చేసేవారికి సిద్ధీ కలుగదు, సుఖమూ కలుగదు, మోక్షమూ కలుగదని గీతాచార్యుడు భగవద్గీతలో భోదించాడు.

కావున అధ్యాత్మభందువులంతా తెలివితో వర్తించి బంగారం కొనాలనే వ్యాపార మాయలోపడకుండా అక్షయతృతీయనాడు శాస్త్రం సూచించినట్టు ఉధకుంభదానం చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రులుకావాలి. ఆకలితో దాహంతో ఉన్నవారికి సహాయపడగలరు. బంగారంకొని దాచుకోవడం శాస్త్ర సమ్మతి కాని పని అని నా అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *